: చంద్రబాబుతో భేటీ కానున్న కాపు కమిషన్ చైర్మన్ మంజునాథ... కమిషన్ కు మరో ఇద్దరు సభ్యులు?


తూర్పు గోదావరి జిల్లా తునిలో హింసాత్మకంగా మారిన ‘కాపు ఐక్య గర్జన’... కాపు కమిషన్ ను త్వరితగతిన పని ప్రారంభించేలా చేసిందనే చెప్పాలి. కాపులకు రిజర్వేషన్ల కల్పనపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందజేసేందుకు కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మంజునాథ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మంజునాథ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటిదాకా కార్యరంగంలోకి దిగలేదు. కాపు గర్జనలో హింస చెలరేగిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన క్రమంలో నేడు జస్టిస్ మంజునాథ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో విజయవాడలో భేటీ కానున్నారు. ఈ భేటీలోనే కమిషన్ విధివిధానాలు, టూర్ షెడ్యూల్ ఖరారు కానున్నాయి. ఇదిలా ఉంటే, జస్టిస్ మంజునాథకు సహాయకులుగా మరో ఇద్దరు సభ్యులను కూడా ప్రభుత్వం కమిషన్ లో నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News