: బాస్కెట్ బాల్ లో ప్లేయర్ గా సోనియా గాంధీ మనవరాలు!...కూతురు స్పీడుతో కేరింతలు కొట్టిన ప్రియాంక


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మనవరాలు, ప్రియాంకా వాద్రా కూతురు మిరయా వాద్రా బాస్కెట్ బాల్ క్రీడలో సత్తా చాటుతోంది. జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ పోటీల్లో భాగంగా హర్యానా తరఫున బరిలోకి దిగిన మిరయా నిన్న పుదుచ్ఛేరిలో జరిగిన మ్యాచ్ లో అందరినీ ఆకట్టుకుంది. కూతురు ఆడుతున్న మ్యాచ్ ను తిలకించేందుకు ఢిల్లీ నుంచి పుదుచ్ఛేరి వచ్చిన ప్రియాంక, ప్రేక్షకుల స్టాండ్స్ లో కూర్చుని కేరింతలు కొట్టింది. మిగిలిన క్రీడాకారుల కంటే శరవేగంగా కదులుతూ మిరయా ప్రత్యర్థి జట్టుపై పై చేయి సాధించింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో మిరయా తన హర్యానా జట్టును గెలిపించింది.

  • Loading...

More Telugu News