: టీమిండియా ఇప్పుడు సమతూకంతో ఉంది: సచిన్


టీట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శనపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో సచిన్ మాట్లాడుతూ, టీట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ అన్నాడు. టీమిండియా సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని సచిన్ కితాబునిచ్చాడు. టీమిండియాలోకి యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ ల పునరాగమనం జట్టును దుర్భేద్యంగా మార్చిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. టీట్వంటీల్లో ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ఓ మధురానుభూతి అని సచిన్ పేర్కొన్నాడు. చివరి టీట్వంటీలో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా తన కుమారుడు అర్జున్ టెన్షన్ పడుతున్నప్పుడు తన భార్య అంజలి ధైర్యం చెబుతూ 'రైనా గెలిపిస్తాడు చూడు' అందని, రైనా అలాగే గెలిపించాడని సచిన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News