: నాగుపాముకు పాలు పోసి పోషించినట్టు 9 ఏళ్లు ఎంఐఎంను పోషించాం: షబ్బీర్ అలీ


హైదరాబాదులో నాగుపాముకు పాలు పోసి పెంచినట్టు తొమ్మిదేళ్ల పాటు ఎంఐఎం పార్టీని పెంచి పోషించామని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, అప్పట్లో ఎంఐఎం నాయకుడు తప్పు చేసినప్పుడు జైల్లో పెట్టించామని అన్నారు. అధికారంలో ఎవరుంటే వారితో ఒవైసీ సోదరులు సంబంధాలు పెట్టుకుంటారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో ఎంఐఎం బీజేపీతో పొత్తుపెట్టుకుందని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అన్ని పార్టీల నేతలను చితకబాదారని అన్నారు. ఓల్డ్ సిటీలో పోలీస్ లకు, ఎలక్షన్ విధులు నిర్వహించిన వారికి ఎంఐఎం బాస్ లా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News