: నాకు పారిపోవాల్సిన అవసరం లేదు: చంద్రబాబు
తాను సింగపూర్ లో ఇల్లు కట్టుకున్నానని.. ప్రజలను మోసం చేసి ఇక్కడి నుంచి పారిపోతానని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘నాకు పారిపోవాల్సిన అవసరం లేదు. ముఫ్పై ఏళ్లుగా నీతి నిజాయతీతో ఉంటున్న నేను పారిపోవాలా? దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుతింటున్నవాళ్లు, జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్లు మాత్రం ఉంటారు. కొంతమంది విద్యార్థులకు ముందుగానే శిక్షణ ఇచ్చి తీసుకువచ్చి వారితో ప్రశ్నలు అడిగిస్తున్నారని, ఇటువంటి రాజకీయ నాయకులను విద్యార్థులు అనుసరిస్తే ఏమవుతుంది? వాళ్లు దొంగలుగా తయారవుతారు’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి వైఎస్సార్ సీపీ నిర్వహించిన 'యువభేరి' సభను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.