: నా జీవిత చరిత్ర సినిమాలో దీపికా పదుకునే నటించాలి: సైనా


తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే కనుక అందులో తన పాత్రను బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటించాలని బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అభిప్రాయపడింది. ఢిల్లీలో అవార్డుల కార్యక్రమంలో సైనా మాట్లాడుతూ, తన పాత్రకు దీపిక అయితే సరిగ్గా సరిపోతుందని తెలిపింది. ఇందుకోసం దీపిక శ్రమపడాల్సిన అవసరం లేదని సైనా చెప్పింది. దీపికా పదుకునే గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కనుక తన పాత్రను అద్భుతంగా పండిస్తుందని సైనా వెల్లడించింది. తామిద్దరం ఎన్నోసార్లు బ్యాడ్మింటన్ ఆడామని సైనా తెలిపింది. దీనిపై స్పందించిన దీపికా అవకాశం వస్తే సైనా పాత్రలో నటిస్తానని వెల్లడించింది. కాగా, ఒలింపిక్ పతకం సాధించిన సైనా జీవిత చరిత్రను సినిమాగా తీయాలని దర్శకుడు అమోల్ గుప్తా భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News