: షబ్బీర్, ఉత్తమ్ దాడి నిందితుల అరెస్టు...డీజీపీ కార్యాలయానికి తరలింపు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడులకు తెగబడిన ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బీజేపీ ఏజెంట్లపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ముందుకు కదిలారు. షబ్బీర్, ఉత్తమ్ లపై దాడికి దిగిన ఎంఐఎం కార్యకర్తలు హబీబ్, కశ్యప్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని డీసీపీ ఆఫీస్ కు తరలించారు. కాగా, విపక్ష నేతలు మూకుమ్మడిగా గవర్నర్ ను కలవడంతో కంటితుడుపు చర్యగా ప్రభుత్వం వారిని అరెస్టు చేయించిందని వారు పేర్కొంటున్నారు. డిప్యూటీ సీఎంపై దాడిచేసిన వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి నిదర్శనం అని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News