: వర్మ సినిమా ‘వంగవీటి’లో రాధా ఇతనే!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వంగవీటి’. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో రూపొందించనున్న ఈ చిత్రం గురించి వర్మ ఒక ట్వీట్ చేశారు. వంగవీటి రంగా అన్నయ్య రాధా అసలు ఫోటోతో బాటు ఈ చిత్రంలో రాధా పాత్రను పోషించనున్న నటుడి ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ‘అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ’ పేరుతో రెండు పోస్ట్ లు చేశారు. అంతేకాకుండా, ‘వంగవీటి రాధాకు కాఫీ అంటే చాలా ఇష్టం. రాధా తన ఆంతరింగికుల మధ్యలో ఉన్న సమయాల్లో చాలా తక్కువసార్లు మాత్రమే ఆయన సిగిరెట్ కాల్చేవారు. ఈ విషయాన్ని వంగవీటి రంగా గారు నాతో చెప్పారు’ అని వర్మ పేర్కొన్నారు. దీంతోపాటు రాధా పాత్ర పోషిస్తున్న నటుడు సిగిరెట్ కాలుస్తున్న, కాఫీ తాగుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. ‘కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి ఉన్న వాళ్లే.. అర్హత ఉన్న నిజమైన కాపులు’ అని వంగవీటి తనతో చెప్పారనే ట్వీట్ నూ వర్మ పోస్ట్ చేశారు.