: 'ఉబర్' కొత్త లోగో విడుదల


ప్రముఖ ట్యాక్సీ సర్వీస్ ఉబర్ సంస్థ కొత్త లోగో విడుదల చేసింది. గతంలో యూ ఆకారంలో ఉండే లోగో స్థానంలో ఇప్పుడు తిరగేసిన సీ ఆకారంలో, వృత్తాకారంలో ఉన్న కొత్త లోగో ఆకర్షిస్తోంది. దాంతో పాటు ఉబర్ వెబ్ సైట్, యాప్ లను కూడా రీ డిజైన్ చేశారు. దాంతో ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకునే వారందరికీ ఉబర్ కొత్త లోగో కనిపిస్తోంది. దానికి సంబంధించి సంస్థ సీఈఓ త్రివిస్ కలానిక్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంస్థను రీ బ్రాండింగ్ చేయడంలో భాగంగా ఈ డిజైన్ లను మార్చామని తెలిపారు.

  • Loading...

More Telugu News