: ముఖ్యమంత్రి నుంచి సందేశం రాలేదు...శుక్రవారమే నిరాహారదీక్ష: ముద్రగడ


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తనకు సందేశం రాలేదని కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కిర్లంపూడిలో ఆయన మాట్లాడుతూ, జీవో విషయంలో ముఖ్యమంత్రి నుంచి ఇంతవరకు ఎలాంటి సందేశం రాలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీవో పచ్చి మోసం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆయననైనా మంచి జీవో ఇవ్వాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. లేని పక్షంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి తన భార్యతో కలిసి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటున్నానని ఆయన హెచ్చరించారు. సీఎం హామీ ఇచ్చారు కనుకే తాము రొడ్డెక్కామని ఆయన చెప్పారు. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. మీడియాను అవమానించే స్థాయికి దిగజారలేదని ఆయన వివరించారు. అలా దిగజారానని భావిస్తే మీడియా ప్రతినిధులకు క్షమాపణలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News