: నోబెల్ శాంతి బహుమతి రేసులో శ్రీశ్రీ రవిశంకర్
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో అభ్యర్థిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఉన్నారని తెలిసింది. కొలంబియాలో వామపక్ష భావజాలం ఉన్న ఉగ్రవాద సంస్థ ఫార్క్ నేతలను ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేలా ఒప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 1964 నుంచి హింసాత్మక మార్గంలో ఉన్న ఫార్క్... 50 ఏళ్లలో 2 లక్షల మందిని బలిగొంది. దాదాపు 60 లక్షల మంది ఫార్క్ బాధితులుగా మారారు. ఈ క్రమంలో రవిశంకర్ జరిపిన చర్చలతో 2012 నుంచి ఫార్క్ నేతలు గాంధేయ మార్గంలో నడుస్తున్నారు. అందువల్లే ఆయన శాంతి బహుమతి పురస్కార రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. శ్రీశ్రీతో పాటు అమెరికా నిఘా సంస్థ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్, కొలంబియాలో చర్చలు జరుపుతున్న మరికొంతమంది శాంతి దూతల పేర్లు కూడా నోబెల్ బహుమతి పరిశీలనలో ఉన్నాయి.