: నిర్మాత నట్టి కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్!


తన బ్యాంకు ఖాతాల్లో నిధులు లేకుండానే, మరో నిర్మాతకు చెక్ ఇచ్చి మోసం చేసిన కేసులో సినీ నిర్మాత నట్టి కుమార్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. సినీ ప్రొడ్యూసర్ రామసత్యనారాయణకు నట్టి కుమార్ ఇచ్చిన పలు చెక్కులు బౌన్స్ కావడంతో ఆయన కోర్టులో కేసు వేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించినా నట్టి గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, నట్టి కుమార్ పై గతంలో కూడా ఇవే తరహా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News