: స్టీవెన్ స్పిల్ బర్గ్ సినిమాను తిరస్కరించిన బాలీవుడ్ నటుడు
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ సినిమాలో చిన్న అవకాశం వచ్చినా చాలు అని ఎదురుచూసేవారు ఎంతో మంది ఉండగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాత్రం దానిని మరో ఆలోచన లేకుండా తిరస్కరించాడు. 'స్లమ్ డాగ్ మిలియనీర్', 'లైఫ్ ఆఫ్ పై', 'మిషన్ ఇంపాజిబుల్' వంటి సినిమాలతో హాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ ను స్పిల్ బర్గ్ సినిమా ఆఫర్ వరించింది. అయితే, అందులోని పాత్ర ద్వారా పెద్ద గుర్తింపు లభించదని భావించిన ఇర్ఫాన్ ఖాన్ దానిని అంగీకరించలేదు. దీంతో నేరుగా స్పిల్ బర్గ్ ఫోన్ చేసి ఆ పాత్ర పోషించాలని కోరారు. అయినప్పటికీ ఆయన కోరికను ఇర్ఫాన్ ఖాన్ సున్నితంగా తిరస్కరించాడట.