: ‘కాపు గర్జన’ విధ్వంసం నిందితులు వీరే!
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సదస్సు హింసాత్మకంగా మారిన సంఘటన తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై ఆందోళన కారులు దాడికి పాల్పడటంతో కొన్ని బోగీలను దగ్ధం కూడా చేశారు. తుని పోలీస్ స్టేషన్ తగులబెట్టడంతో పాటు పోలీసులను, రైల్వే సిబ్బందిని ఆందోళనకారులు తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు విదితమే. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభంతో పాటు పలు పార్టీలకు చెందిన 27 మంది నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ జాబితా వివరాలు.. ముద్రగడ పద్మనాభం- ఏ1, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ, మాజీమంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వట్టి వసంత్ కుమార్, వైఎస్ఆర్ సీపీ నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసుదాసు, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీమంత్రి కె.వి.సీహెచ్.మోహన్ రావు, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బరావు, దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్సీ గంగా భవానీ, సినీ నటుడు జీవీ సుధాకర్, విజయవాడ బీజేపీ నేత అడపా నాగేంద్ర, బీజేపీకి చెందిన (అమలాపురం) నల్లా విష్ణు, నల్లా పవన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన (అమలాపురం) కె.తాతాజీ, వేదపాలెం టీడీపీకి చెందిన బండారు శ్రీనివాసరావు, కొత్తపేట వైఎస్ఆర్ సీపీకి చెందిన ముత్యాల వీరభద్రరావు, నెం.1 చానల్ ఎండీ ఎంఎస్ఆర్ నాయుడు, పసుపులంక వైఎస్ఆర్ సీపీకి చెందిన దూలిపూడి చక్రం, బీజేపీ, ఏఎల్డీఏ చైర్మన్ యెల్లా దొరబాబు, ఆలేటి ప్రకాష్, వైఎస్ఆర్ సీపీ, ముమ్మడివరం మండలంకు చెందిన జామితేనె లంకల పై పోలీసు కేసులు నమోదు చేశారు.