: విజయవాడ పూల మార్కెట్ అగ్ని ప్రమాదంలో మహిళ సజీవదహనం
విజయవాడ పూల మార్కెట్ సమీపంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో రమాదేవి అనే మహిళ సజీవదహనం అయింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనలో మార్కెట్ కు దగ్గరలో ఉన్న గుడిసెలకు నిప్పంటుకుంది. దాంతో అక్కడున్న ఆ మహిళ మంటల్లో చిక్కుకుని చనిపోయింది. అంతేగాక 150కి పైగా గుడిసెలు తగలబడుతున్నాయి. మరోవైపు రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలనార్పుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు బాధితులంతా ఆర్తనాదాలు చేస్తున్నారు. కాగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.