: విజయవాడ పూల మార్కెట్ లో మంటలు... తగలబడిపోతున్న దుకాణాలు
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కొద్దిసేపటి క్రితం మరో ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని పూల మార్కెట్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో పూల దుకాణాలు తగలబడిపోతున్నాయి. అంతేకాక శరవేగంగా విస్తరించిన అగ్ని కీలలు సమీపంలోని పూరి గుడిసెలను కూడా చుట్టుముట్టాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. అగ్ని కీలలను అదుపు చేసే పని ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.