: కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం: బీసీ సంఘాల నేతలు


ఓ వైపు తమను కూడా బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు నేతలు డిమాండ్ చేస్తుంటే, మరోవైపు బీసీలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన సమావేశానికి 25 బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాపు కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదని, కాపుల ఒత్తిడికి తలొగ్గి జీవో ఇస్తే అభాసుపాలవుతారని హెచ్చరించారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీసీ సంఘాల నేతలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News