: మోదీని తూలనాడినందుకే పోలీసులు అలా చేశారట!
న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న యువతులపై పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారన్నట్టు కనిపిస్తున్న వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులు అలా ఎందుకు చేశారన్న విషయమై, అంతకుముందు జరిగిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. కొందరు విద్యార్థినులు, ప్రధాని నరేంద్ర మోదీని రాయడానికి వీల్లేని విధంగా తూలనాడుతూ, దమ్ము, ధైర్యముంటే తమపై చర్యలు తీసుకోవాలని పదే పదే నినాదాలు చేస్తున్నట్టు ఈ తాజా వీడియోలో కనిపిస్తోంది. సోమవారం తొలి వీడియో బయటకు వచ్చిన తరువాత, పోలీసుల చర్యలను ఖండిస్తూ, విద్యార్థినులపై ఇంతటి దారుణ చర్యలేమిటని ఆప్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను ఓ విద్యార్థిని తన మొబైల్ నుంచి చిత్రీకరించినట్టు సమాచారం.