: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని కట్టడం తథ్యం: మంత్రి నారాయణ


నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై వస్తున్న అడ్డంకులపై ఏపీ మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని కట్టడం తథ్యమని తేల్చి చెప్పారు. కానీ వైసీపీ అధినేతలు పదేపదే రాజధాని రైతులను రెచ్చగొట్టడం తగదని విజయవాడలో సూచించారు. రాజధానిలోని 6 గ్రామాల్లో వెయ్యి ఇళ్లు తొలగిస్తామని చెప్పారు. అయితే బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, దానిపై ఒకటి రెండు రోజుల్లో కలెక్టర్ తుది నివేదిక ఇస్తారని తెలిపారు. కలెక్టర్ నివేదిక ఇచ్చాక ఆ మేరకు సీఎం నిర్ణయం తీసుకుంటారని మంత్రి వివరించారు. తాను చెప్పని మాటలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News