: తునిలో మీడియా ప్రతినిధులకు ముద్రగడ క్షమాపణలు


ఏపీ మీడియా ప్రతినిధులకు కాపు అధినేత ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన హింసాకాండలో పలువురు జర్నలిస్టులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఇవాళ తుని వచ్చిన ముద్రగడను పలువురు విలేకరులు నిలదీశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడమేంటని, ఇది చాలా దారుణమంటూ ప్రశ్నించారు. ఈ సమయంలో వారితో ముద్రగడ అనుచరులు గొడవకు దిగగా ఆయన వారిని శాంతింపజేశారు. చివరగా మీడియాకు క్షమాపణలు చెబుతున్నాననడంతో వివాదం సర్దుమణిగింది.

  • Loading...

More Telugu News