: ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు... నాంపల్లి కోర్టుకు తరలింపు
ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై హైదరాబాదు, మలక్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీసీ 341, 448, 427, 506, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో మజ్లిస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై బలాల, ఆయన అనుచరులు నిన్న (మంగళవారం) దాడి చేశారు. ఈ సమయంలో అలీ కుమారుడు అజం అలీకి గాయాలయ్యాయి. దాంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.