: విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. మంత్రులందరూ పాల్గొన్న ఈ భేటీలో కాపుల రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని, నివేదికపై జస్టిస్ మంజునాథ కమిషన్ కు సూచించేలా తీర్మానించే అవకాశం ఉంది. అంతేగాక కమిషన్ విధివిధానాలపైనా చర్చించనున్నారు. కాపు కార్పొరేషన్ కు రూ.2వేల కోట్లు కేటాయించాలని చేస్తున్న డిమాండు, కాపుల దరఖాస్తుల పరిష్కారంపై మంత్రివర్గంలో నిర్ణయించే అవకాశం ఉంది. ఇక పోలవరం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చేపట్టాల్సిన చర్యలపై, వివిధ సంస్థలకు భూకేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలపైనా చర్చిస్తారు.