: కోహ్లీకి షాకిచ్చిన అనుష్క?... మ్యారేజ్ ప్రపోజల్ ను తిరస్కరించిందట!


టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల సుందరి అనుష్క శర్మల ప్రేమాయణం కొత్త మలుపు తిరిగిందన్న కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రేమలో పీకల్లోతు మునిగిపోయిన వీరిద్దరూ బహిరంగంగానూ తిరిగేందుకు ఏమాత్రం భయపడలేదు. టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ జరిగితే, అక్కడ అనుష్క శర్మ వాలిపోయింది. మ్యాచ్ ల మధ్య విరామ సమయాల్లో ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో అనుష్కతో కలిసి విరాట్ చక్కర్లు కొట్టాడు. ఆయా సందర్భాల్లో ఈ జంట మీడియాకూ చిక్కిపోయింది. అంతేకాదు, వయసులో ఉన్న తాము కలిసి తిరిగితే తప్పేంటి? అంటూ అనుష్క మీడియాకే ఎదురు ప్రశ్నలు సంధించి సంచలనం రేపింది. అయితే, ఇది గతం. ఇప్పుడు వారిద్దరి మధ్య బంధం తెగిపోయిందని కథనాలు వెలువడ్డాయి. పెళ్లి చేసుకుందామన్న కోహ్లీ ప్రతిపాదనను అనుష్క నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిందట. దీంతో వీరిద్దరి మధ్య బంధం దాదాపుగా తెగిపోయినట్టేనని మీడియా కథనాలు ఇస్తోంది. అయితే ఈ విషయాన్ని అటు కోహ్లీ గాని, ఇటు అనుష్క గాని ఇప్పటిదాకా ధ్రువీకరించలేదు.

  • Loading...

More Telugu News