: డీజీపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా
హైదరాబాదు పాతబస్తీలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఓల్డ్ సిటీకి వెళ్లిన షబ్బీర్ అలీపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రౌడీ రాజ్యం నశించాలంటూ నినాదాలు చేశారు. షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై దాడికి కారణమైన వారిని తక్షణం అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఆందోళన విరమించే ప్రసక్తిలేదని వారు స్పష్టం చేశారు.