: చెన్నై వరద బాధితులకు బ్రిడ్జిస్టోన్ భారీ విరాళం
తమిళనాడు రాజధాని చెన్నైలో గతేడాది కురిసిన భార్షాలు, వరదల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జిస్టోన్ భారీ విరాళం అందించింది. ఈ మేరకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దానికి సంబంధించిన చెక్కును పీఎంవో కార్యాలయంలో ఇచ్చినట్టు సంస్థ భారత డైరెక్టర్ అజయక సెవెకరి తెలిపారు. అంతేగాక చెన్నై వాసుల జీవితాలను పునర్మించేందుకు బ్రిడ్జిస్టోన్ తన వంతు పాత్ర నిర్వహిస్తుందని ఆ సంస్థ భారత విభాగం ఎండీ కఝుహికో మిమురా పేర్కొన్నారు.