: పాతబస్తీకి వెళ్లాలంటే అసదుద్దీన్ ని అడగాలా? : షబ్బీర్ అలీ
పాతబస్తీకి వెళ్లాలంటే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని అడగాలా? అంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అసద్ నుంచి పర్మిషన్ తీసుకుని తాము అక్కడ అడుగుపెట్టాలని అంటున్నారని, పోలీస్ స్టేషన్ వద్దే తమపై దాడి జరిగితే దిక్కే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పాతబస్తీలో ప్రజాస్వామ్యం లేదు..దాదా గిరీయే. తనను ప్రశ్నించేవాళ్లు వస్తున్నారని అసదుద్దీన్ దాడులకు పాల్పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని చూస్తే ఆయనకు భయం..’ అని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కాగా, పాతబస్తీలోని పూరానాపూల్ లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి స్వల్పగాయాలైన సంగతి తెలిసిందే.