: గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా


టీమిండియా టీట్వంటీ స్పెషలిస్ట్ ఆటగాడు సురేశ్ రైనా కు బంపర్ ఆఫర్ వచ్చింది. ఐపీఎల్ లో రాజ్ కోట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన యాజమాన్యం ఆ జట్టు పేరును గుజరాత్ లయన్స్ గా మార్చింది. దీనితోపాటు ఈ జట్టుకు టీమిండియా కీలక ఆటగాడు సురేష్ రైనాను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఈ జట్టులో బ్రెండన్ మెక్ కల్లమ్ (కివీస్), డ్వెన్ బ్రావో (విండీస్), రవీంద్ర జడేజా, జేమ్స్ ఫాల్కనర్ (ఆసీస్) లు కీలక ఆటగాళ్లు. అలాగే ఈ జట్టుకు బ్రాడ్ హడ్జ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. జట్టును రోస్టర్ విధానంలో కొనుగోలు చేయనుంది. ఈ జట్టుకు కేశవ్ బన్సాల్ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రైనా గతంలో ధోనీ కెప్టెన్సీలో ఆడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News