: వివిధ దేశాల నేతలు జాతీయ ఉపాథి హామీ పథకం అమలు చేస్తామని చెప్పారు: రాహుల్ గాంధీ
వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు తనను కలిసిన సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం తమ దేశాల్లో కూడా అమలు చేస్తామని అన్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఉపాధి హామీ పధకం చేపట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలను ఆకట్టుకుంటుందని అన్నారు. దీని వల్ల వ్యవసాయ కూలీలు, పేదల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చిందని పేర్కొన్నారు. అప్పటి వరకు పేదల కష్టాన్ని దోచేసిన వ్యక్తులు వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిన తరువాతే పేదల ఇళ్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడం ప్రారంభించారని ఆయన తెలిపారు.