: చిరంజీవి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి నారాయణ
సీఆర్డీఏ చట్టంపై అవగాహన లేకుండా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. అలా అవగాహన లేకుండా ఆయన ఏదిపడితే అది మాట్లాడి రైతులను రెచ్చగొట్టవద్దని మంత్రి హితవు పలికారు. ప్రభుత్వం చట్టప్రకారం వ్యవహరిస్తోందా? లేదా? అని విషయాన్ని గమనించిన తర్వాతే ఎవరైనా విమర్శించాలని అన్నారు. కాగా, తక్షణం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని సీఎం చంద్రబాబుకు చిరంజీవి బహిరంగ లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాసిన లేఖ సబబేననంటూ ప్రముఖ నటి విజయశాంతి మద్దతు పలకడం విదితమే.