: పోలీస్ స్టేషన్ లో చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా చార్మినార్ పరిధిలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీని పోలీసులు అదుపులోకి తీసుకుని చార్మినార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేత గౌస్ ఖాన్, ఎంఐఎం నేత పాషా ఖాద్రీ ఎదురు పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రేకానికి గురైన వీరిద్దరూ పరస్పర దూషణలకు దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కాగా, గౌస్ ఖాన్ తనను చెప్పుతో కొట్టాడని, అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.