: రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షంపైనే నిందలు వేస్తారా?: బొత్స
రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా ప్రతిపక్షంపైనే నిందలు వేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం గత నాలుగు నెలలుగా తన అభిప్రాయాలను చెబుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ముద్రగడ ఇంటికెళ్లి సంఘీభావం తెలిపిన బాబు, ఇప్పుడు కూడా ఆ పనిచేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కాపు ఐక్య గర్జన సదస్సుకు వెళ్లిన యువకులను వేధింపులపాలు చేయవద్దని ప్రభుత్వానికి బొత్స సూచించారు. కాపులను బీసీల్లో చేర్చకపోవడంపై మనస్తాపం చెందిన వెంకటరమణమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధకరమన్నారు.