: బండ్లపల్లి చేరుకున్న మన్మోహన్ సింగ్, రాహుల్... ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి


మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లి చేరుకున్నారు. 2006లో బండ్లపల్లిలో యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పథకానికి భరోసా ఇచ్చేందుకుగానూ వారిద్దరూ వచ్చారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో రాహుల్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ పుట్టపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News