: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి కలాం పేరు పెట్టనున్నాం: మంత్రి గంటా
ఒంగోలు ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఇవాళ ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇందులో క్లాసులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. అంతేగాక ట్రిపుల్ ఐటీకి మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నామని మీడియాకు తెలిపారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందేే.