: గాయాలకు ఇప్పుడు మూత్రం బదులు డెట్టాల్ వాడుతున్నారు: లాలూ
పాట్నాలో ఇవాళ జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతి... చేతులను డెట్టాలతో కడుక్కోవడమేనని చెప్పారు. ప్రస్తుతం ఇది మంచి యాంటీసెప్టిక్ లా పని చేస్తుందన్నారు. తన చిన్నతనంలో దెబ్బలు తగిలినప్పుడు గాయాలను మూత్రంతో కడిగేవాళ్లని, అప్పుడది యాంటీసెప్టిక్ గా పనిచేసేదని అన్నారు. ప్రస్తుతం అందరూ దాని స్థానంలో డెట్టాల్ వాడుతున్నారన్నారు. అంతేగాక చేతులు కూడా కడుక్కుంటున్నారని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి తన పెద్ద కుమారుడు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ రావాల్సి ఉంది. కానీ ఆయన బిజీగా ఉండటంతో తాను హాజరయ్యానని లాలూ సభలో ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.