: ఎంఐఎం,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ!
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకు ప్రాంతంలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. తొలుత ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారి తీసింది. అంతేకాకుండా, తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ లోనూ ఓటర్లు ఆందోళనకు దిగారు. గుర్తింపు కార్డు ఉన్నా ఓటు వేయనీయడం లేదని తెలిపారు.