: హైదరాబాద్ లో ఓటేసేందుకు రావాలని ఫోన్లకు మెసేజ్ లు!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో పోలింగ్ సరళి మందకొడిగా సాగుతుండటంతో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఓటేసేందుకు రావాలని 'వీకే-లెట్స్ వోట్' పేరిట బల్క్ మెసేజ్ లను ఓటర్లకు పంపుతున్నారు. ప్రజలంతా ఓటు వేయని కారణంగానే సరైన ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం లేదని, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని మెసేజ్ లు పంపుతున్నారు. కాగా, ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకూ పోలింగ్ శాతం 20ని దాటలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.