: గవర్నర్ నరసింహన్ తో బాలకృష్ణ భేటీ


సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఈ ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లో ఓటేసిన అనంతరం ఆయన రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా వీరిద్దరి మధ్యా భేటీ జరుగగా, అనంతరం బయటకు వచ్చిన బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి రెండు రోజుల పాటు జరిగే లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొనాలని గవర్నర్ ను ఆహ్వానించినట్టు తెలిపారు. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని వివరించారు.

  • Loading...

More Telugu News