: నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త... అరెస్టు
గ్రేటర్ ఎన్నికల క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సోమాజిగూడ కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ టోపీలు, కరపత్రాలతో ఆయన పోలింగ్ కేంద్రానికి రావడంతో అక్కడే ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్ మెట్ లో డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ప్రకటించలేదని కార్మికులు ఉప్పల్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్నారు.