: 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ‘యాహూ’!


ప్రముఖ ఐటీ కంపెనీ ‘యాహూ’ సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఒక కథనం ప్రచురితమైంది. యాహూ సంస్థ నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయని.. ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపు విషయాన్ని ప్రకటించనుందని.. ‘యాహూ’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారని రాసింది. ఉద్యోగులను తొలగించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లోని తమ వ్యాపార యూనిట్లను మూసివేయనుందని తెలిపింది. కాగా, ఈ-కామర్స్ ను విస్తృతం చేయడంలో సదరు సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సెర్చ్, వార్తలు, క్రీడలు మొదలైన విభాగాల్లో ఫేస్ బుక్, గూగుల్ ఆల్ఫాబెట్ నుంచి యాహూ సంస్థ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

  • Loading...

More Telugu News