: అనుపమ్ ఖేర్ కు చుక్కెదురు... తమ దేశానికి రానివ్వని పాకిస్థాన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు, త్వరలో భారత పద్మ పురస్కారాలలో రెండో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అందుకోనున్న అనుపమ్ ఖేర్ ను తమ దేశంలోకి రానిచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. కరాచీలో జరగనున్న ఓ సాహిత్య సమ్మేళనానికి వెళ్లాలని భావించిన అనుపమ్ ఖేర్ వీసాకు దరఖాస్తు చేసుకోగా, పాక్ అధికారులు వాటిని తోసిపుచ్చారు. గత కొంతకాలంగా ఇండియాలో జరుగుతున్న 'అసహనం' వివాదంలో అనుపమ్ ఖేర్ బీజేపీ వైపు నిలిచి పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన పలువురు సినీ నటులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అసహనం లేదంటూ ఆయన ఓ ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పాక్ వీసాను నిరాకరించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News