: రిజర్వేషన్లపై కాపు నేతలతో చంద్రబాబు కీలక సమావేశం
కాపులకు రిజర్వేషన్లు అంశంపై ఆ వర్గం నేతలతో కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం జరపనున్నారు. ఈ ఉదయం 11 గంటల తరువాత ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గ మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస్ తదితరులతో పాటు పలువురు నేతలు హాజరు కానున్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడివుందని, అయితే, ఈ మేరకు వివాదరహిత మార్గంలో వెళ్లాలన్నదే తన అభిమతమని ఇప్పటికే స్పష్టం చేసిన చంద్రబాబు, గతంలో విడుదలైన జీవో 30లోని అంశాలను గురించి కాపు నేతలకు వివరించనున్నారని సమాచారం. రిజర్వేషన్లు అత్యంత సున్నితమైన అంశమని, తొందరపడి నిర్ణయాలు కూడదని ఆయన నచ్చజెప్పనున్నట్టు తెలుస్తోంది.