: ఎందరో రాజకీయ నేతలు శారీరకంగా వాడుకున్నారు: న్యాయ కమిషన్ ముందు సరితా నాయర్


కేరళలో కలకలం రేపిన సౌర కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా నాయర్, న్యాయ కమిషన్ ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. "నన్ను ఎందరో రాజకీయ నాయకులు శారీరకంగా, మానసికంగా వాడుకున్నారు" అని ఆమె ఆరోపించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి సహా పలువురిపై ఆరోపణలు చేసిన ఆమె, అందుకు సంబంధించిన సాక్ష్యాలున్న 3 సీడీలను, పలు దస్త్రాలను కమిషన్ కు అందించారు. తాను ఆడియో, వీడియో సీడీలను కమిషన్ కు ఇచ్చానని, ఇందులో తనకు, కాంగ్రెస్ నేతలు తంపనూర్ రవి, బెన్నీ బెహానన్, ఊమన్ చాందీ సెక్యూరిటీ గార్డు సలీమ్ రాజ్, వ్యాపారవేత్త అబ్రహాం కలిమన్నెల్ మధ్య జరిగిన సంభాషణలున్నాయని, త్వరలో మరిన్ని సాక్ష్యాలను ఇస్తానని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మరొక్క మాట కూడా మాట్లాడవద్దని తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఈ కేసులో భాగంగా సరితను, ఆమెతో సహజీవనం చేస్తున్న బిజు రాధాకృష్ణన్ ను 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాయర్ బెయిలుపై బయట ఉండగా, రాధాకృష్ణన్ మాత్రం తన మొదటి భార్యను హత్య చేసిన కేసులో జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News