: కూలీల కోసం ఏపీకి కదిలిన మన్మోహన్ సింగ్, రాహుల్


పేదలకు పని కల్పించి, వారికి కడుపునిండా తిండి పెట్టాలన్న ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి బయలుదేరారు. పీసీసీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం జరగనున్న బహిరంగ సభలో పాల్గొనే వీరు, అంతకుముందు పలు గ్రామాల సర్పంచ్‌ లు, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. ఈ పథకానికి సంబంధించిన పైలాన్ ను వారు ఆవిష్కరిస్తారని, తిరిగి 4.30 గంటలకు బెంగళూరు వెళ్తారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News