: చిన్నారి శాన్విని చిదిమేసిన బోరుబావి!


తెరచివుంచిన బోరుబావి మరో చిన్నారిని చిదిమేసింది. నిన్న ఆడుకుంటూ వెళ్లి పొరపాటున బోరుబావిలో పడిన శాన్వీ మరణించింది. శాలీగౌరారం మండలం వల్లాలకు చేందిన స్వామి, సుస్మితల గారాల బిడ్డ శాన్వీ సోమవారం మధ్యాహ్నం బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణం స్పందించి, 12 గంటల్లోగానే ఆమెను బయటకు తీసినప్పటికీ, అప్పటికే బిడ్డ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. బోరుబావికి సమాంతరంగా 25 అడుగుల లోతైన గుంత తీసిన అధికారులు, శాన్విని చేరుకునేందుకు ముందే ఆమె ప్రాణాలు పోయాయని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News