: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రేటర్ పోలింగ్


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనుండగా, మొత్తం 150 డివిజన్లకు గాను 1333 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని, 3 వేల మంది టెక్కీలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 74,23,980 మంది ఓటర్లుండగా, అందులో పురుషులు 39,69,007, మహిళలు 34,53,910 ఇతరులు 1163 మంది ఉన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News