: అతను తన ఇష్టానుసారం మాట్లాడుతున్న రాజకీయ నేరస్తుడు: జగన్ పై మండిపడ్డ చంద్రబాబు


కాపులు ఓట్లు వేస్తేనే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వారికి సంబంధించిన అంశాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రతిఒక్కరిని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అయితే, కాపు ఐక్య గర్జన సదస్సు హింసాత్మకంగా మారడంపై అవినీతి పార్టీ నేతలు, నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘మామూలు నేరస్తుడైతే పోలీసులు సమాధానం చెబుతారు. అవినీతి పార్టీ అధినేత ఒక రాజకీయ నేరస్తుడు. నా రాజకీయ జీవితం అంత అతని వయస్సు. నిన్న టీవీలో అతను మాట్లాడిన భాష ఎంత అసభ్యంగా ఉంది!..దీనిని భాష అని ఎవరైనా అంటారా? చిన్నపిల్లలు కూడా ఈ విధంగా మాట్లాడరు. నేరస్తులు, సైకోలు ఎట్లా ఉంటారంటే, ఈ విధంగానే ఉంటారు. ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా సంబోధించాలన్న సంస్కారం కూడా ఆ పార్టీ నేతలకు లేదు. అటువంటి వారు రాజకీయాల్లో ఉన్నారు. ఆ భాష, సంబోధించే విధానం.. మనిషి అన్నాక మనకు కూడా ఇర్రిటేషన్ ఉండదు? ప్రపంచమంతా నన్ను గుర్తించి, గౌరవిస్తూ ఉంటే.. ఒక రాజకీయ నేరస్తుడు రాజకీయ ముసుగులో తన ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది!.. సాధారణ నేరస్తుడైతే పోలీసులు డీల్ చేసేవాళ్లు. ఇతను రాజకీయ ముసుగులో ఉండే నేరస్తుడు కనుక భరించాల్సి వస్తోంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు’ అని చంద్రబాబు పరోక్షంగా జగన్ పై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News