: జగన్ తెలిసీతెలియక మాట్లాడుతున్నాడు: మంత్రి దేవినేని
స్పీకర్ కోడెల, తాను హత్య కేసులో ముద్దాయిలమంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిసీతెలియక మాట్లాడుతున్నాడని మంత్రి దేవినేని ఉమ అన్నారు. కాపుల ఉద్యమాన్ని రెచ్చగొట్టి జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడని, అధికారం లేదన్న మనస్తాపం ఆయనలో కనిపిస్తోందని అన్నారు. జగన్ మానసిక స్థితిపై తనకు అనుమానం కల్గుతోందని ఉమ విమర్శించారు.