: రూ.కోటి విలువైన మద్యం, రూ.2.58 కోట్ల నగదు స్వాధీనం: ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి
రేపు జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ‘గ్రేటర్’ ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 83 శాతం పోలింగ్ స్లిప్పులు పంచామని, 46 వేల మంది సిబ్బందిని, ఈవీఎంల పరిశీలనకు 300 మంది ఇంజనీర్లను నియమించామని, 12,200 ఈవీఎంలు, 704 ఆర్టీసీ బస్సులు, 473 మినీ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.కోటి విలువైన మద్యం, రూ.2.58 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.