: సెహ్వాగ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రీతి జింటా
మాజీ టీమిండియా ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కు కింగ్స్ లెవెన్ పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా కొత్త బాధ్యతలు అప్పగించింది. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆటగాడిగా వెలుగొందిన సెహ్వాగ్ ఇప్పుడు ఆ జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు. పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ కు సెహ్వాగ్ సహాయకుడుగా వ్యవహరించనున్నాడు. దీనిపై బంగర్ మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో సెహ్వాగ్ బ్యాట్స్ మన్ గా జట్టులో స్పూర్తినింపాడని అన్నాడు. ఇప్పుడు మెంటర్ గా అతని సలహాలు, సూచనతో జట్టు మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సెహ్వాగ్ నియామకం జట్టును మరింత పటిష్ఠం చేస్తుందని బంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.