: తెలుగు టైటాన్స్ ఘన విజయం
ప్రోకబడ్డీ లీగ్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తొలి విజయం సాధించింది. ప్రొకబడ్డీ లీగ్ లో భాగంగా విశాఖపట్టణంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో తెలుగు టైటాన్స్ తో పూణే పల్టాన్స్ జట్టు తలపడింది. తొలి మ్యాచ్ లో 'యూ ముంబ' జట్టుతో జరిగిన మ్యాచ్ లో పరాజయం పాలైన తెలుగు టైటాన్స్ జట్టు, నేడు జరిగిన మ్యాచ్ లో తొలుత వెనుకబడింది. ఆఖర్లో జూలు విదిల్చిన తెలుగు టైటాన్స్ వరుసగా పాయింట్లు సాధించడంతో ఆఖరు నిమిషంలో స్కోరు సమం చేసింది. ఈ దశలో రైడ్ కు వెళ్లిన తెలుగు టైటాన్స్ స్టార్ ఆటగాడు రాహుల్ ఛౌధురి పాయింట్ సాధించడంతో 27-26 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తెలుగు టైటాన్స్ ఈ సీజన్ లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ ను బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తిలకించాడు.